Reading Time: < 1 minute

డీజిల్ దొంగలు.. ప్రైవేటు బస్సులు, లారీలు టార్గెట్.. సంగారెడ్డి జిల్లాలో 150 లీటర్ల డీజిల్ చోరీ

Caption of Image.

బంగారం దొంగలు, ఏటీఎం దొంగలు.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ దొంగలు. అవును దేశంలో వస్తున్న ఆర్థిక సంక్షోభ కారణాలతో ఈ మధ్య పెట్రోల్, డీజిల్ షార్టేజ్ అవుతుండటం చూస్తేనే ఉన్నాం. పెట్రోల్ బంకులు మూసిన ఘటనలు కూడా చూశాం. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. ప్రైవేటు బస్సులు, లారీలు లభ్యంగా చేసుకుని వందల లీటర్లు ఎత్తుకెళ్తున్నారు. 

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో డీజిల్ దొంగలు కలకలం సృష్టించారు. ప్రయివేట్ స్కూల్ బస్సుల్లో నుంచి 50 లీటర్లు, మరో చోట లారీ నుంచి 100 లీటర్ల డీజిల్ చోరీ చేశారు. 2026 మే 13న అర్ధరాత్రి జరిగింది ఈ ఘటన. ఎవరూ లేని సమయం చూసి క్యాన్లలో వచ్చి డీజిల్ ఎత్తు్కెళ్లారు. 

►ALSO READ | సాయం చేస్తానని ఏటీఎం కార్డు తీసుకొని..రైతు అకౌంట్ నుండి రూ.70 వేలు కొట్టేశాడు…

డీజిల్ దొంగలపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. కారులో వచ్చి డీజిల్ చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే.. కారుకు ఉన్న నంబర్ ప్లేట్ ఆటోది కావడం షాకింగ్ గురిచేస్తోంది. అదే విధంగా చోరీకి వాడిన కారుకూడా  దొంగతనం చేసిందేనని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.