Reading Time: < 1 minute

పుదుచ్చేరి సీఎంగా 5వ సారి రంగస్వామి బాధ్యతల స్వీకరణ

Caption of Image.

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా AINRC వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ నేత ఎన్.రంగస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ప్రాంతీయపార్టీకి చెందిన మల్లాది కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ.నమశ్శివాయం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బుధవారం (2026  మే 13) పుదుచ్చేరిలో AINRC ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. 

లెఫ్టినెంట్ గవర్నర్ కె.కైలాశ్ నాథ్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడిమీద ప్రమాణం చేసి సీఎం రంగస్వామి ప్రమాణం చేశారు. మల్లాది కృష్ణారావు తెలుగులో ప్రమాణ స్కీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ హాజరయ్యారు. 

ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రంగస్వామిని సీఎంగా నియమించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. పోర్టుఫోలియోలు వచ్చే వారం నిర్ణయించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మద్ధతుతో పుదుచ్చేరిలో టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పారు. 

పుదుచ్చేరిలో 30 సీట్లుండగా.. ఎన్డీఏ 18 సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమిలో AINRC 12, బీజేపీ 4, ఏఐఏడీఎంకే, ఎల్జేకే ఒక్కో సీటు గెలిచాయి. ప్రతిపక్షాలు 12 సీట్లు గెలిచాయి. ఇందులో డీఎంకే, కాంగ్రెస్, టీవీకే ఉన్నాయి. 

©️ VIL Media Pvt Ltd.