Reading Time: < 1 minute
Rajasthan Set Target Of 160 Runs For Lucknow

ఐపీఎల్ 2026 లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 06 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్నోకు 160 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌లతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఇద్దరు యువ బ్యాట్స్ మెన్స్ దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టారు. మూడో ఓవర్‌లో షమీ యశస్వి వికెట్ తీశాడు. వికెట్ వెనుక రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.

యశస్వి 22 పరుగులు చేశాడు. అదే ఓవర్‌లో షమీ జురెల్ వికెట్ కూడా తీశాడు. జురెల్ కనీసం తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో మోసిన్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీసి రాజస్థాన్‌ ను పెద్ద దెబ్బ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత రియాన్ పరాగ్ ఇన్నింగ్స్‌ను తన ఆధీనంలోకి తీసుకుని, 7 ఓవర్ల తర్వాత జట్టు స్కోరును 50 దాటించాడు. కానీ 9వ ఓవర్‌లో, 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్ ఔటవడంతో ప్రిన్స్ యాదవ్ రాజస్థాన్‌ ను నాలుగో దెబ్బ కొట్టాడు. 19 బంతుల్లో 20 పరుగులు చేసిన డోనోవన్ ఫెరీరా, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో రెండో వికెట్‌గా అవుటయ్యాడు.