
మరో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మంగళవారం ఇరాన్‌తో చర్చలుంటాయని చెప్పారు. ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే అమెరికాతో చర్చలకు ఇరాన్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదించిన ప్రతిపాదనలు అంగీకరించబోమని తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
ఇస్లామాబాద్ వేదికగా తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. దాదాపు ఇరాన్-అమెరికా మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. చివరికి ఎటు తేలకుండా చర్చలు ముగిశాయి. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్-అమెరికా ఏర్పడిన తాత్కాలిక ఒప్పందం ఏప్రిల్ 21తో ముగుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందంలోపు శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఈసారి తీవ్ర దాడులుంటాయని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే అమెరికాతో చర్చలకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఏం జరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
ఇదిలా ఉంటే ఇరు దేశాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ గత వారం ఇరాన్‌లో పర్యటించారు. ఇరాన్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమై శాంతి ఒప్పందంపై చర్చించారు. అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు గానీ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. మంగళవారం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయా? లేదా? అన్నది సందిగ్ధంగానే ఉంది. ఒకవేళ జరగకపోతే మళ్లీ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తప్పేటట్లు కనిపించడం లేదు.