
యూరోప్‌లో కొత్త నిబంధనల కారణంగా బోర్డింగ్ సమయంలో 120 మందికి పైగా ప్రయాణికులు ఫ్లైట్ మిస్ అయ్యారు. యూరోప్‌లో తాజాగా బోర్డర్ కంట్రోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. ప్రయాణికుల పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయాల్సిఉంది. చెకింగ్ ఆలస్యమవడంతో వారు ఎయిర్‌పోర్టులో ఉన్నా ఫ్లైట్ ఎక్కలేకపోయారు.ఇటలీలోని మిలన్ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు వెళ్లేందుకు 156 మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందే వారంతా విమానాశ్రయానికి చేరుకున్నారు. పాస్‌పోర్ట్ చెకింగ్ క్యూ వద్ద కనీసం 3 – 4 గంటల సమయం పట్టడంతో చాలామంది బోర్డింగ్ గేట్‌కు చేరుకోలేకపోయారు. 156 మందిలో కేవలం 34 మంది పాస్‌పోర్ట్‌లు మాత్రమే చెకింగ్ పూర్తయ్యాయి. దీంతో దాదాపు 120 మంది ప్రయాణికులు ఫ్లైట్‌ని మిస్ అయ్యారు. టెర్మినల్ లోపల చాలా రద్దీగా ఉండడంతో గంటల తరబడి క్యూ కదల్లేదని ప్రయాణికులు వాపోయారు. కొత్త పద్ధతుల్లో చెకింగ్ చేయడంతో కొందరు గంటల తరబడి నిల్చొనే ఉండటం వల్ల అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ప్రయాణికుల కోసం విమానాన్ని కొంత సమయం ఆపినా.. తర్వాత భద్రతా కారణాల రీత్యా బయల్దేరవలసి వచ్చింది. సరిహద్దు భద్రత కారణంగా యూరోపియన్ దేశాలు కొత్తగా ఎంట్రీ/ ఎగ్జిట్ సిస్టమ్ తనిఖీని ప్రారంభించాయి. దీంతో బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్, డేటాబేస్ చెకింగ్ వల్లే ఈ ఆలస్యం జరిగిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. రద్దీగా ఉండే సమయాల్లో ఈ ప్రక్రియకు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘తనొక ఉడుత’ విజయ్‌కు వ్యతిరేకంగా నటి ప్రచారం
Anakapalli: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
తండ్రిపై కోపం.. 100 కి.మీ. మేర సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికి వెళ్లాడో తెలుసా ?? చివరికి