Reading Time: < 1 minute
Cm Chandrababu Naidu Nidadavolu Visit Today Full East Godavari Tour Schedule

CM Chandrababu Nidadavolu visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రజా వేదిక సమావేశం, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన, పార్టీ కార్యకర్తల సమావేశం వంటి పలు కార్యక్రమాలతో సీఎం బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం 10:30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 11:00 గంటలకు నిడదవోలు పట్టణంలోని ఎం.వి నగర్ మారుతి లేఅవుట్ సమీపంలో ఉన్న St. Ambrose School వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు స్వాగతం పలకనున్నారు.

Read Also: Russia Oil: భారత్ రష్యా చమురు కొనొచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..

తర్వాత ఉదయం 11:15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి 11:20 గంటలకు సుబ్బారాజుపేట – సింగవరం రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమ స్థలానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1:15 గంటల వరకు జరిగే సమావేశంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి 1:45 గంటల మధ్య మలకోడు సరస్సు ప్రాంతానికి చేరుకుని అక్కడ నీటిమొక్కలు (వాటర్ హైసింత్) నుంచి కంపోస్టింగ్ ప్రక్రియపై పరిశీలన చేయనున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలతో సీఎం పరస్పర చర్చలు జరపనున్నారు. తరువాత మధ్యాహ్నం 2:30 గంటలకు నిడదవోలు పట్టణంలోని సెయింట్ అంబ్రోస్ పాఠశాల సమీపంలో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు హెలికాప్టర్ ద్వారా నిడదవోలు నుంచి బయలుదేరి, సాయంత్రం 4:45 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిడదవోలులో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.