Reading Time: < 1 minute
Nagababu Strong Counter To Prakash Raj Comments On Lord Rama

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ పరండా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికి.. వ్యాక్తిగతంగా మాత్రం ఎప్పుడు తన అర్ధం లేని మాటలతో వార్తలో నిలుస్తూ ఉంటారు. ఇందులో భాగంగా.. ఇటీవల రామాయణం శ్రీరాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై నెటిజన్లతో పాటు పలువురు ప్రముఖులు కూడా మండిపడుతున్నారు. అయితే తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ పేరు ఎత్తకుండానే గట్టి కౌంటర్ ఇచ్చారు.

Also Read : Hansika : రెండేళ్ళు నరకం చూశా.. మొత్తనికి విడాకులపై క్లారిటి ఇచ్చిర హన్సిక..!

నాగబాబు తన పోస్ట్‌లో శ్రీరాముడి గొప్పతనాన్ని వివరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ‘శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు రూపం. ఆయన్ని కించపరచడం సాహసం కాదు, అది అహంకారం, అజ్ఞానం మాత్రమే. రాముడిని ఎగతాళి చేసే వారు ఆయన్ని ఏమీ చేయలేరు, తమను తాము గాయపరుచుకుంటారు. ధర్మానికి వ్యతిరేకంగా నిలబడిన వారిని చరిత్రే అణచివేసింది. రాముడిపై విషం చిమ్మే వారి గతి కూడా అంతే’ అంటూ పరోక్షంగా ప్రకాష్ రాజ్‌పై విరుచుకుపడ్డారు.

సాధారణంగా నాగబాబు కూడా తనను తాను నాస్తికుడిగా చెప్పుకుంటారు. కానీ, భారతీయ సంస్కృతికి, ధర్మానికి ప్రతీక అయిన రాముడి విషయంలో ప్రకాష్ రాజ్ హద్దులు దాటడం నాగబాబుకు నచ్చలేదని ఈ పోస్ట్ ద్వారా స్పష్టమవుతోంది.. ‘రాముడి నామం ఒక రక్షణ కవచం.. ఆయన ఉనికి మన నాగరికతకు చెక్కుచెదరని కోట’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. గతంలో కూడా ప్రకాష్ రాజ్ నాగబాబు మధ్య ‘మా’ (MAA) ఎన్నికల సమయంలో రాజకీయ పరంగా విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ‘రామాయణం’ వివాదం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తోంది.