Reading Time: < 1 minute

నీట్ బాధిత కుటుంబాలను కలిసిన రాహుల్ గాంధీ.. విద్యార్థులకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Caption of Image.

నీట్ పేపర్ లీక్‌కు సంబంధించిన నిరసనల సందర్భంగా తనను వ్యక్తిగతంగా దూషించిన విద్యార్థులను  క్షమిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన  వ్యాఖ్యలపై  రాహుల్ గాంధీ ఫైరయ్యారు. మోదీ క్షమించడం కాదు.. విద్యార్థులకు క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు.  శనివారం (ఈగస్టు 01) నీట్ బాధిత కుటుంబాలను కలిసిన రాహుల్.. వారిని ఓదార్చారు. ఈ సందర్భ ఘాటుగా స్పందించారు.  
 
తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను చూడటం కంటే ఎక్కువ బాధాకరమైన విషయం ఏదీ లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  పేపర్ లీక్‌లు, పరీక్షల రద్దు కారణంగా సంవత్సరాల పాటు పడిన కష్టం వృథా అయ్యిందని..  వేలాది మంది విద్యార్థుల కలలు నాశనమయ్యాయని ఆయన అన్నారు. 

నీట్ పేపర్ లీక్ తో చనిపోయిన విద్యార్థుల ఏ ఒక్క బాధిత  కుటుంబాన్ని మోదీ కలవలేదని రాహుల్ అన్నారు.   విద్యార్థులకు కావాల్సింది ప్రధాని క్షమాపణ.. ఆయన క్షమించడం కాదని అన్నారు. 

అంతకు ముందు నీట్ పేపర్ లీక్ నిరసనల చుట్టూ ఉన్న వివాదంపై ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ వీడియో విడుదల చేసిన ఒక రోజు తర్వాత గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు . ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా తనను, తన దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను తాను క్షమించాలనుకుంటున్నట్లు మోదీ ఆ వీడియోలో తెలిపారు.

వారిని దారితప్పిన పిల్లలు అని పేర్కొంటూ, వారిని శిక్షించడం కాకుండా మార్గనిర్దేశం చేయాలని ఆయన సమాజానికి విజ్ఞప్తి చేశారు. యవ్వనంలో చేసే తప్పులు జీవితకాల శిక్షకు కారణాలుగా కాకుండా, నేర్చుకోవడానికి అవకాశాలుగా మారాలని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.