తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా బోనాల సంబరాలు అంబరాన్నంటున్నాయి. సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ వాసవి గణేశన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొంది.
హుషారు పిట్టలతో హీరోయిన్ గా పరిచయం కానున్న వాసవీ గణేశన్ తాజాగా బోనమెత్తింది. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన పొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటికి ‘ఎల్లమ్మా తల్లీ బ్లెస్సింగ్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోల్లో చీరకట్టులో చాలా సంప్రదాయబద్ధంగా దర్శనమిచ్చింది వాసవి గణేశన్. ప్రస్తుతం ఈ యంగ్ హీరోయిన్ బోనాల ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా వాసవి హీరోయిన్ గా నటిస్తోన్న హుషారు పిట్టలు సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న విడుదల కానుంది.
దర్శకుడు బిక్షు తెరకెక్కిస్తోన్న ‘హుషారు పిట్టలు’ సినిమాలో అన్షు హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ యాదవ్ నిర్మాత కాగా, ఏషియన్, సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కంటెంట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.




