పల్లీ నువ్వుల లడ్డుకు తయారీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పల్లీలు (వేరుసెనగలు), అర కప్పు నువ్వులు, పావు కిలో బెల్లం, అర టేబుల్ స్పూన్ ఏలకుల పొడిని తీసుకోవాలి.
పల్లీ నువ్వుల లడ్డు తయారీ విధానం ముందుగా పల్లీలు వేయించుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్లో పల్లీలు వేసి మీడియం మంటపై వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత పొడి లాగా దంచుకోవాలి.
నువ్వులు వేయించుకోవాలి: అయితే, అదే పాన్లో ఒక కప్పు నువ్వులు వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకుని బెల్లం వేసి దానిని పాకంలాగా చేసుకోవాలి
ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి: ఇప్పుడు బెల్లం పాకంలో కొన్ని పల్లీలు, నువ్వులు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
చిన్న లడ్డూలుగా చేసుకోవాలి : ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టుకుని కొద్దీ సేపటి తరవాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న లడ్డూలుగా చేయండి. అంతే, పల్లీ నువ్వుల లడ్డులు రెడీ.




