Reading Time: < 1 minute
Us Iran Tensions Trump Uranium Claim Iran Response

US-Iran War: అమెరికా, ఇరాన్ సంఘర్షణలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ తన అణు పదార్థాన్ని అప్పగించడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అయితే, ఈ వాదన తప్పని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తిరస్కరించింది. ఇరాన్ తన ‘‘ఎన్ రిచ్డ్ యురేనియం’’ను ఎక్కడికి బదిలీ చేయదు అని ఇరాన్ ప్రతినిది ఇస్మయిల్ బఖాయీ స్పష్టం చేశారు.

Read Also: Bus Fire : కూకట్‌పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

ఇరాన్ వద్ద నుంచి యురేనియం తీసుకుంటామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే దీనిని ఇరాన్ తిరస్కరించడం గమనార్హం. ‘‘మా గొప్ప బీ2 బాంబర్లు సృష్టించి అణు ధూరి అంతా అమెరికాకు దక్కుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. సుసంపన్నమైన యురేనియాన్ని తిరిగి పొందేందుకు అమెరికా ఇరాన్‌తో కలిసి పనిచేస్తుందని ట్రంప్ చెప్పారు. ఇరాన్‌తో కలిసి భారీ యంత్రాలతో తవ్వకాలు ప్రారంభిస్తామని, యురేనియాన్ని యూఎస్‌కు తీసుకువస్తామని, త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. యురేనియం వద్ద 700 కిలోల వరకు ఎన్‌రిచ్డ్ యురేనియం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, యురేనియం తమ శాంతియుత ప్రయోజనాల కోసమే అని ఇరాన్ వాదిస్తోంది.