Reading Time: < 1 minute
Surya Tj Gnanavel Next Movie After Jai Bhim Jagaram Studios Update

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జై భీమ్’ ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఒక యథార్థ సంఘటన ఆధారంగా సాగే ఇంటెన్స్ డ్రామా అని తెలుస్తోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్’ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, జ్ఞానవేల్ తన తదుపరి చిత్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశలో ఉంది. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ ‘జగరం స్టూడియోస్’పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘జై భీమ్’ లాగే ఈ సినిమా కూడా సామాజికో సమస్యల చుట్టూ తిరుగుతూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉండబోతోందని టాక్. ప్రస్తుతం సూర్య కెరీర్‌లో వరుస ప్రాజెక్టట్ లతో బిజీ ఫేజ్‌లో ఉన్నారు. ఇందులో ‘కరుప్పు’ (వీరభద్రుడు) మే 14న విడుదల కాబోతుంది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. Suriya#47 ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో షూటింగ్ జరుగుతోంది. కాగా ఈ మూడు సినిమాల తర్వాతే జ్ఞానవేల్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. కేవలం మూడు నెలల వ్యవధిలో సూర్య నుండి రెండు సినిమాలు రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘సూర్య ప్రభంజనం’ ఖాయమనిపిస్తోంది.