Gold vs Stocks: బంగారం వర్సెస్ షేర్లు: అక్షయ తృతీయకు ముందు వెలువడిన గణాంకాల ప్రకారం, గత ఏడాది కాలంలో బంగారం పెట్టుబడిదారులకు అదిరిపోయే లాభాలను అందించింది. నిఫ్టీ 50 కంటే బంగారం మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అయితే, మార్కెట్లో రెండు ప్రత్యేక షేర్లు మాత్రం బంగారం కంటే ఎక్కువ రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేశాయి.
పసిడి పరుగు – 62% రిటర్న్స్: గత ఏడాది అక్షయ తృతీయ (ఏప్రిల్ 30, 2025) నుండి ఇప్పటి వరకు బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆప్షన్‌గా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో పసిడి సుమారు 62% లాభాలను అందించింది. అదే సమయంలో నిఫ్టీ 50 కేవలం 0.7% వద్ద స్థిరంగా ఉంది.
శ్రీరామ్ ఫైనాన్స్ – 69% లాభం: బంగారం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన మొదటి షేరు ‘శ్రీరామ్ ఫైనాన్స్’. గత ఏడాది కాలంలో ఈ షేరు విలువ సుమారు 69% పెరిగింది. MSME రంగానికి, గోల్డ్ లోన్ సెగ్మెంట్లో ఈ కంపెనీ సాధించిన వేగవంతమైన విస్తరణే ఈ లాభాలకు ప్రధాన కారణం.
హిందాల్కో ఇండస్ట్రీస్ – 67.7% వృద్ధి: మెటల్ రంగ దిగ్గజం ‘హిందాల్కో’ ఇన్వెస్టర్లకు 67.7% రిటర్న్స్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో మెటల్స్ డిమాండ్ పెరగడం, కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాల వల్ల ఈ స్టాక్ పసిడిని మించి రాణించింది.
రేసులో వెనుకబడిన టాటా స్టీల్, BEL: టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వంటి కంపెనీలు కూడా మంచి ఫలితాలను సాధించినప్పటికీ, అవి బంగారం ఇచ్చిన 62% రిటర్న్స్‌ను మాత్రం దాటలేకపోయాయి. దీంతో గత ఏడాదికి గోల్డ్ ‘విన్నర్’గా నిలిచింది.
2026లో బంగారం ధర అంచనా: నిపుణుల అంచనా ప్రకారం, 2026లో కూడా బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.7 లక్షల నుండి రూ.1.85 లక్షల వరకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.





