
దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలియా భట్. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అలియా భట్ ప్రస్తావన తీసుకురావడానికి కారణం ఆమె సిస్టర్ షాహీన్ భట్. మహేష్ భట్, సోనీ రజాన్ల పెద్ద కుమార్తె అయిన ఆమె స్క్రీన్ రైటర్ గా సత్తా చాటుతోంది. అలాగే మానసిక ఆరోగ్యంపై తన వంతు అవగాహన కల్పిస్తోంది. తాజాగా షాహీన్ భట్ నిశ్చితార్థం చేసుకుంది. ఇషాన్ మెహ్రీ అనే వ్యక్తితో కలిసి ఉంగరాలు మార్చుకుంది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇషాన్ తో కలిసున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ ‘మేము ఒకరినొకరు ఇష్టపడటంలో కాస్త అతిగా చేశామేమో’ అంటూ ఓ క్రేజీ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం షాహీన్ భట్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువరు సినీ ప్రముఖులు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అలియా భట్ అత్త నీతూ కపూర్, సోనీ రజ్ఙాన్, అనన్య పాండే, నీనా గుప్తా, మసాబా గుప్తా, జోయా అక్తర్, షనయా కపూర్ తదితరులు షాహీన్- ఇషాన్ లకు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. ఇక షాహీన్ కాబోయే భర్త విషయానికి వస్తే.. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కోచ్ గా రాణిస్తున్నాడు ఇషాన్.
కాబోయే భర్తతో షాహీన్ భట్..
మహేష్ భట్, సోనీ రజ్దాన్ లకు షాహిన్ భట్ తో పాటు ఆలియా భట్, పూజా భట్, రాహుల్ భట్ అనే మరో ముగ్గురు సంతానం. వీరిలో అలియా భట్ రణ్ బీర్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి రాహా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే… చివరిసారిగా జిగ్రా మూవీలో కనిపించిన అలియా భట్. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ‘లవ్ అండ్ వార్’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఓ తెలుగు సినిమాలోనూ అలియా నటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
కాబోయే పెళ్లి కూతురితో అలియా భట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.