కిటికీలు, పరదాల నిర్వహణ: చాలా మంది పగటిపూట కిటికీలు తెరిస్తే గాలి వస్తుందని భావిస్తారు, కానీ అది పొరపాటు. పగటి వేడి గాలి లోపలికి రాకుండా ఉండాలంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కిటికీలు, పరదాలను పూర్తిగా మూసి ఉంచాలి. ఇది బయటి వేడిని ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అలాగే సాయంత్ర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి. అప్పుడు కిటికీలు తెరిస్తే క్రాస్ వెంటిలేషన్ ద్వారా ఇంట్లోని వేడి గాలి బయటకు పోయి చల్లని గాలి లోపలికి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది.
ఫ్యాన్ వాడే కొత్త పద్ధతులు: ఫ్యాన్ అనేది కేవలం గాలిని మాత్రమే కదిలిస్తుంది, కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ గాలిని మనం చల్లగా మార్చుకోవచ్చు. వేసవిలో ఫ్యాన్ రెక్కలు గడియారపు ముల్లుకు వ్యతిరేక దిశలో తిరిగేలా చూసుకోవాలి. దీనివల్ల గాలి నేరుగా కిందికి నెట్టబడుతుంది. అలాగే ఫ్యాన్ కింద ఒక గిన్నెలో ఐస్ ముక్కలు వేసి పెట్టండి అది గది అంతటా చల్లని గాలిని వ్యాపింప జేస్తుంది. అలాగే సాయంత్రం వేళల్లో ఫ్యాన్‌ను కిటికీ వైపు తిప్పి ఉంచితే, గదిలోని వేడి గాలి త్వరగా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇల్లు చల్లబడుతుంది.
లోపలి వేడిని తగ్గించడం: ఇంట్లో వాడే కొన్ని వస్తువుల వల్ల కూడా వేడి పెరుగుతుంది. పాత కాలపు బల్బులకు బదులుగా LED లైట్లను వాడండి, ఇవి తక్కువ వేడిని విడుదల చేస్తాయి. దాని వల్ల ఇంట్లో వేడి తగ్గుతుంది. అలాగే వంటగదిలో స్టవ్, ఓవెన్ల వల్ల వేడి పెరుగుతుంది. కాబట్టి ఉదయం లేదా రాత్రి వేళల్లోనే వంట ముగించడం మంచిది. అలాగే అవసరం లేని సమయంలో టీవీలు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి. అప్పుడు వాటిని నుంచి వేడి బయటకు రాకుండా ఉంటుంది. ఇది ఇంట్లో లేకుండా చూస్తుంది.
శరీర ఉష్ణోగ్రత: గదినే కాదు సమ్మర్లో మీ బాడీని కూడా చల్లగా ఉంచుకోవాలి. ఇందుకోసం గాలి ఆడేలా ఉండే పత్తి దుస్తులను ధరించాలి. అలాగే మెడ, మణికట్టు, మోకాళ్ల వెనుక భాగంలో తడి గుడ్డతో తుడుచుకోవడం వల్ల రక్త ప్రసరణ చల్లబడి శరీర వేడి తగ్గుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు కిటికీలకు తడి పరదాలను వేలాడదీస్తే అవి సహజమైన కూలర్లా పనిచేస్తాయి.
రూప్‌టాప్ పెయింటింగ్: ఇంటి పైకప్పు మీద తెల్లటి పెయింట్ లేదా వేడిని ప్రతిబింబించే టైల్స్ వేయడం వల్ల ఇల్లు వేడెక్కదు. అలాగే ఇంట్లో నీడను ఇచ్చే మొక్కలను పెంచడం వల్ల గాలి శుభ్రపడటమే కాకుండా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పుల ద్వారా వేసవి తాపం నుండి ఉపశమనం పొంది, మీ ఇంటిని ఏసీ లేకుండానే హాయిగా ఉంచుకోవచ్చు!




