దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ హన్సిక. తొలి సినిమాతోనే తన క్యూట్ నెస్ తో కుర్రాళ్ల గుండెల్లో ప్రింట్ అయ్యింది ఈ చిన్నది. దేశముదురు సినిమా తర్వాత ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హన్సిక. తెలుగు స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా, రామ్ తో కందిరీగ, మస్కా సినిమాలో నటించింది. కెరీర్ పీక్ లో ఉండగానే బాలీవుడ్ లోనూ అదృష్టన్ని పరీక్షించుకుంది.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ అమ్మడు.. 2022 డిసెంబర్ 4న జైపూర్ ప్యాలెస్ లో వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియా ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లైన 4 ఏళ్లకే విడాకులు తీసుకుంది.
తమకు విడాకులు మంజూరు చేయాలని హన్సిక బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తాజాగా న్యాయస్థానం వీరికి విడాకులు మంజూరు చేసింది. కాగా తాజాగా హన్సిక చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది హన్సిక.
ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. అంతే కాదు చాలా స్వేచ్చగా ఉన్నానని, ఒంటరితనం తనకు ఎప్పుడూ ఇష్టమని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఒంటరిజీవితంలో చాలా సంతోషం కలిగింది అని అన్నారు. తన వాళ్ల కోసం సమయాన్ని గడపడం, తనకు నచ్చింది చేయడం చాలా సంతోషంగా ఉంది అని నటి హన్సిక చెప్పుకొచ్చింది.




