
సినిమా చరిత్రలో ఆమెది ఓ చెరిగిపోని సంతకం.. హీరోయిన్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానం, ఎన్నో అద్భుత పాత్రలు… తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయకిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఓ వెలుగు వెలిగారు ఆమె. దాదాపు 400ల సినిమాలు చేశారు. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, రెండుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. అయితే, తెరపై ఆమె సాధించిన విజయాలకు భిన్నంగా, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని విమర్శలపాలయ్యారు. ఆమె ఎవరో కాదు ఊర్వశి శారద. నటి శారద అసలు పేరు సరస్వతి. సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరు శారదగా మారింది. ఆంధ్రప్రదేశ్ తెనాలిలో 1945 జూన్ 25న వెంకటేశ్వరరావు, సత్యవతీదేవి దంపతులకు శారద జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. మోహన్‌రావు అనే సోదరుడు ఉన్న శారద, చిన్నతనంలోనే చెన్నైలో తన అమ్మమ్మ వద్ద పెరిగారు.
Srihari: ఆ హీరో ఫైట్స్ చేస్తుంటే భయమేసేది.. అందుకే అతని బాధ్యత తీసుకున్నా..!
తండ్రికి శారద సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం లేనప్పటికీ, ఆమె ఆరేళ్ల వయస్సు నుంచే నటనను ఆరంభించారు. 1955లో వచ్చిన కన్యాశుల్కంలో చిన్న పాత్రలో నటించిన ఆమెకు, 1961లో విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమాతో గుర్తింపు లభించింది. సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలోనే శారదకు నటుడు చలంతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి అన్నీ వేగంగా జరిగిపోయాయి. అయితే, చలంను పెళ్లి చేసుకున్న తర్వాత శారద జీవితం ఊహించని మలుపు తిరిగింది. నటుడిగా చలం కెరీర్ పతనమవుతున్న సమయంలో, శారద హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉండటం గమనార్హం. ఆర్థిక కారణాలతో చలం, శారదల మధ్య మనస్పర్థలు తలెత్తి, వారు విడిపోవాల్సి వచ్చింది. కొందరు అప్పట్లో ఈ పరిణామాలను చలం మొదటి భార్య శాపఫలంగా భావించేవారు. ఎందుకంటే, చలం తన కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారదకంటే ముందే రమణకుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు.
అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె
ఆమె పేరులోని రమణను తన పేరులో చేర్చుకుని రమణా చలంగా మారారు. అయితే, శారద మోజులో పడి, అంతగా ప్రేమించిన భార్యను మోసం చేశాడని, ఆ బాధతో రమణకుమారి ఆత్మహత్య చేసుకుని కన్నుమూసిందని ప్రచారం జరిగింది. ఆ పాపఫలమే శారద వైవాహిక జీవితంపై పడిందని, అందుకే ఆమె కష్టాలు పడ్డారని పలువురు గుసగుసలాడుకున్నారు. కాలక్రమేణా, కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తిని పోగొట్టుకున్న చలం, పూర్తిగా మద్యానికి బానిసయ్యారు. 1984లో శారద ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి, విడాకుల నోటీసు పంపి చలం నుండి విడిపోయారు. చలం తన మొదటి భార్యతోనే కలిసి ఉండి ఉంటే దీనస్థితికి వచ్చేవాడు కాదని, శారదకు కూడా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. వారి ప్రేమ వల్ల ఓ నిండు జీవితం బలైపోవడమే కాకుండా, ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పేవారు. శారద ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎక్కువ కాలం నిలవలేదు. పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు.
సచిన్‌తో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. అప్పట్లో తెగ చక్కర్లు.. అసలు విషయం చెప్పిన నటి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.