
దిన ఫలాలు (ఏప్రిల్ 17, 2026): మేష రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. మిథున రాశి వారు వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా మెరుగ్గా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఆహార, విహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఊహించని వస్తు లాభం ఉంటుంది. కొందరు బంధు మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలపరంగా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు గతం కంటే బాగా మెరుగ్గా ఉంటాయి. గృహ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా బాగా సాయం చేస్తారు. వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగాల్లో ఒకటి రెండు సమస్యల్ని అధిగమిస్తారు. వృత్తి జీవితం ఆశించిన విధంగా సాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ప్రస్తుతానికి ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆదాయం, ఆరోగ్యం బాగానేఉంటాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు చాలావరకు ప్రోత్సాహకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో సర దాగా గడుపుతారు. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. మీ సలహాలు, సూచనలకు సర్వత్రా విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో అనుకూలతలు నెలకొంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రస్తుతానికి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. బంధువులు కొందరు ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగిపోయే అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
ఉద్యోగాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా పరవాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగుతుంది. ఇంట్లో సౌకర్యాల మెరుగుదల మీద దృష్టి పెడ తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపు తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభ ముంటుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయానికి లోటుండదు. పిల్లల విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉంటుంది. ఇంటా బయటా శ్రమ తప్పకపోవచ్చు. మీ ఆలోచనలు, నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఆస్తి వివాదాలు, సమస్యలు చక్కబడే అవకాశముంది. ఆదాయ ప్రయత్నాలు పూర్తిగా సఫలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారాల్లో కలిసివస్తుంది.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదాయ మార్గాలు నిలకడగా సాగుతాయి. పిల్లల చదువులు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితిలో కొద్దిగా పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాల్లో ఆటం కాలు తొలగిపోతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయంలో మెరుగ్గా ఉంటుంది. సోదరులతో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.