Reading Time: < 1 minute
Noida Violence Over 300 Arrested Police Probe Alleged Foreign Link Behind Social Media Provocation

Noida Violence: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఇటీవల నోయిడాలో హింసకు పాల్పడ్డారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ హింసాకాండకు సంబంధించి 300 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ఈ హింస వెనక పాకిస్తాన్ ప్రయత్నం ఉందని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఏప్రిల్ 13, 2026న @Proudindiannavi, @Mir_llyas_INC అనే ఎక్స్ అకౌంట్ల ద్వారా అనేక పోస్టులు షేర్ చేసి, రెచ్చగొట్టినట్లు తేలింది. అశాంతిని రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం ఈ పోస్టుల ఉద్దేశమని పోలీసులు గుర్తించారు.

Read Also: MI vs PBKS: ముంబైతో పంజాబ్ ఢీ.. ఫిట్‌నెస్ సమస్యతో రోహిత్ అవుట్..!

ఈ తప్పుడు సమచారంతోనే గౌతమ్ బుద్ధనగర్ లోని పలు ప్రాంతాల ఆగ్రహాన్ని వ్యాప్తి చేసినట్లు తేలింది. ఈ పోస్టుల ద్వారా రెచ్చగొట్టడంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, జనాలు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చినట్లు తేలింది. రాళ్లదాడులకు పాల్పడటంతో పాటు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. ఈ రెండు ఎక్స్ హ్యాండిల్స్ పాకిస్తాన్ నుంచే ఆపరేట్ అవుతున్నట్లు తేలింది. ఈ హింసను ప్రేరేపించడంలో పాకిస్తాన్ హస్తం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ హ్యాండిల్స్ నిర్వహిస్తున్న వ్యక్తులు వీపీఎన్ ఉపయోగించి తన గుర్తింపును దాచినట్లు పోలీసుల విచారణలో వ్యక్తమైంది.