Reading Time: 2 minutes
ముసుగు తొలగిన మృగం.. 350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు

ప్రేమ పేరుతో వలవేసి మైనర్‌ బాలికలను ట్రాప్‌లోకి లాగుతాడు.. ఆపై వారిపై అంతులేని ప్రేమను కురిపిస్తూ చనువు పెంచుకుంటాడు. ఆ తర్వాత వారితో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తాడు.. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. మహారాష్ట్రలో వెలుగుచూసిన ఈ సైకో మృగం ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరతవాడా ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన అశ్లీల వీడియోల కుంభకోణం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో వంచించి, అమాయక యువతుల జీవితాలతో ఆడుకున్న 350కి పైగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియా వేదికలపై వైరల్ కావడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుడు తొలుత యువతులను ప్రేమ పేరుతో వలలో వేసుకోవడం, ఆపై వారితో చనువుగా ఉంటూ రహస్యంగా వీడియోలు చిత్రీకరించడం ఇతడి ప్రధాన వ్యూహం. ఆ వీడియోలను చూపించి బాధితులను బ్లాక్‌మెయిల్ చేస్తూ, వారిని మరింత వేధింపులకు గురిచేసేవాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణానికి దాదాపు 108 మంది యువతులు బలయ్యారని సమాచారం. వీరిలో పలువురు మైనర్లు కూడా ఉండటం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. ఈ అశ్లీల వీడియోలను నిందితుడు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో నెట్‌వర్క్ సాగడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతనిపై పోక్సో చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం మండిపడుతున్నారు. బాధితుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ కేసును SITతో దర్యాప్తు చేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. బాధితుల గోప్యతను కాపాడుతామని హామీ ఇచ్చిన పోలీసులు, ఈ కేసు వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మరోసారి డిజిటల్ భద్రత మరియు మహిళల రక్షణపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సోషల్ మీడియా యుగంలో అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా

ఇరాన్ చమురుపై అమెరికా ఉక్కుపాదం.. సడలింపుల పొడిగింపునకు ‘నో’

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. సర్వదర్శనం టోకెన్ల జారీలో మార్పులు

ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే షాకవుతారు

Singer Chitra: సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్