జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్ర గ్రహం ఇప్పటికే మేష రాశిలో సంచారం చేస్తున్నాడు, అయితే ఏప్రిల్ 17న చంద్రుడు మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో రెండు గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీని వలన వైభవ్ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందిస్తుంది.
మేష రాశి : మేష రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. ఈ రాశి వారు తమ సంతానం వలన చాలా ఆనందంగా గడుపుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడం, ఒకే చేయడం వలన ఈ రాశి వ్యాపార వేత్తలు చాలా ఆనందంగా ఉంటారు. పనుల్లో ఆటంకాలు తొలిగిపోయి చాలా ఆనందంగా గడుపుతారు.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అన్ని విధాలుగా చాలా బాగుంటుంది
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. శత్రు బాధలు తగ్గుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. ఆదాయం బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది.
కుంభ రాశి : కుంభ రాశి వారికి పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్న వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది.




