Reading Time: < 1 minute
Tcs Announces Salary Hikes And Hiring Plans Amid Nashik Controversy

TCS: ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల తొలగింపు కాలం ముగిసిందని చెప్పిది. ఏడాది పాటు కొనసాగిన లేఆఫ్స్, పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చింది. టీసీఎస్ తన వార్షిక జీతాల సవరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్లు చెప్పింది. అత్యుత్తమ పనితీరు కనబరిచే వారికి రెండంకెల (10 శాతానికి పైగా) పెంపు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే, చాలా మంది ఉద్యోగులకు వారి రేటింగ్, గ్రేడ్ ఆధారంగా 4.5 శాతం నుంచి 7 శాతం మధ్య పెంపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Rohit Sharma: ‘ముంబైకి రాజా’ ఏంటి ఆ చిలిపి పనులు.. ప్లేయింగ్ XIలో ఉంటాడా?

గతంలో పోలిస్తే నియామకాల సంఖ్య తగ్గినప్పటికీ, నియామకాలు కొనసాగుతున్నాయని కంపెనీ చెబుతోంది. టీసీఎస్ చీఫ్ హెచ్ ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నమ్మల్ ప్రకారం.. ఈ ఏడాది సుమారుగా 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 25,000 క్యాంపస్ ఆఫర్లు ఇవ్వబడ్డాయని చెప్పారు.

ఇదిలా ఉంటే, నాసిక్ ఘటనతో టీసీఎస్ వార్తల్లో నిలిచింది. కార్పొరేట్ జిహాద్, లవ్ జిహాద్‌కు పాల్పడినట్లు హిందూ సంఘాలు, బీజేపీ ఆరోపిస్తోంది. హిందూ ఉద్యోగుల్ని ముస్లిం టీమ్ లీడర్లు, హెచ్‌ఆర్ నిదాఖాన్ కలిసి ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈకేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. మరొక మహిళా ఉద్యోగి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందూ దేవీదేవతలను తిట్టడం, మహిళల్ని లైంగికంగా వేధించడం, మత నమ్మకాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.