
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి మాజీ పేసర్ మునాఫ్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించవద్దని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని హెచ్చరించాడు. అది ఏమాత్రం ఇండియన్ టీమ్ కి మంచిది కాదని పేర్కొన్నారు. ఎందుకంటే, రోహిత్ శర్మ– విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లకు మొహమాటం లేకుండా ‘నో’ చెప్పే ధైర్యం ఒక్క గంభీర్‌కే ఉందని మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డారు.
గంభీర్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి, జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన వెనుకాడరని మునాఫ్ పటేల్ వెల్లడించారు. జట్టులో క్రమశిక్షణను కాపాడటంలో గంభీర్ పాత్ర కీలకం, అతడ్ని తొలగిస్తే టీమ్ మేనేజ్‌మెంట్ కష్టమవుతుందని తెలిపారు. గౌతమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పుకొచ్చాడు. గంభీర్ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి మూడు ప్రధాన టోర్నీలను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేకపోతున్నాయి పేర్కొన్నాడు.
ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో, 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఢిల్లీ కొనసాగుతోంది. ఒకవైపు గంభీర్ కోచింగ్ శైలిపై చర్చ జరుగుతుంటే, మరోవైపు మునాఫ్ పటేల్ లాంటి మాజీ ఆటగాళ్లు అతడికి అండగా నిలవడం ఆసక్తికరంగా మారింది.