Reading Time: 2 minutes

Toaster Review: తెలుగులో స్ట్రీమింగ్కి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్.. స్టోరీ మొత్తాన్ని మలుపులు తిప్పిన ఒక ‘టోస్టర్’

Caption of Image.

డార్క్ కామెడీ అనేది చాలా ప్రయోగాత్మకమైన జానర్. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో ఈ జానర్‌పై ఎక్కువగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మలయాళం, తమిళ సినిమాలు ఈ జానర్‌లో మంచి ఫలితాలు ఇచ్చాయి. అయితే, బాలీవుడ్ మాత్రం ఇంకా ఈ జానర్‌ను పూర్తిగా అర్థం చేసుకునే దశలోనే ఉంది. అంధాధున్, బ్లాక్‌మెయిల్ వంటి సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. జడ్జ్ మెంట్ హై క్యా సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్‌ రావు నుంచి డార్క్ కామెడీ ‘‘టోస్టర్’’ (Toaster) వచ్చింది. ఇవాళ ఏప్రిల్ 15న డైరెక్ట్గా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో రిలీజైంది. డిఫెరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

‘‘టోస్టర్’’అంటే తెలిసిందే: బ్రెడ్ ముక్కలను వేడి చేసి కరకరలాడేలా మార్చే ఒక చిన్న ఎలక్ట్రిక్ పరికరం. డార్క్ కామెడీకి తగినట్లుగా సినిమాలో ఎన్నో ట్విస్టులు, పాత్రలు ఉంటాయి.

కథ:

రామకాంత్ అనే మధ్యవయస్కుడు (Rajkummar Rao) చాలా పిసినారి. డబ్బులు ఆదా చేయడం మంచిదే. కానీ మరీ పిసినారిగా వ్యవహరిస్తాడు. తన భార్య స్నేహితురాలి పెళ్లికి గిఫ్ట్‌గా టోస్టర్ కొనాల్సి వస్తుంది. ఇష్టం లేకపోయినా భార్య ఒత్తిడికి లొంగిపోతాడు. అలా రూ.5 వేలు విలువ చేసే ఒక టోస్టర్ ను బహుమతిగా తీసుకెళ్తారు. ఆ జోడీకి గిఫ్ట్ అందిస్తారు. కానీ, అనూహ్యంగా పెళ్లి రద్దవడంతో, ఆ టోస్టర్‌ను తిరిగి తెచ్చుకోవాలని రామకాంత్ ప్రయత్నిస్తాడు.

అప్పటికే ఆ టోస్టర్ అనాథాశ్రమానికి దానం చేయబడుతుంది. అక్కడి నుంచి టోస్టర్ కోసం ప్రారంభమైన ప్రయాణం అనేక విచిత్ర మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా రమాకాంత్ ప్రయత్నంలో ఊహించని మర్డర్ మిస్టరీలు, ప్రమాదాలు, దాగి ఉన్న రహస్యాలు బయటపడే స్థాయికి వెళ్తాయి. ఇంతకీ రమాకాంత్ ఆ టోస్టర్ తెచ్చుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.   

రాజ్‌కుమార్‌ రావు సినిమాల విషయానికి వస్తే, 2010లో ‘రణ్‌’ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చారు. 2013లో విడుదలైన ‘షాహిద్’ సినిమాకు గాను ఉతమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. 2024లో ‘స్త్రీ 2’తో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అతని కెరియర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఫిల్మ్స్లో నటించి మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఈ మూవీ కూడా ఓటీటీ ప్రేక్షకుల్ని వీపరీతంగా ఆకట్టుకుంటుంది.

©️ VIL Media Pvt Ltd.