
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి సినిమా రిలీజ్ వల్ల కాదు, ఆయన చేసిన అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వల్ల. ఇటీవల ఆయన జిమ్‌లో తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోలో శరీరాన్ని సానపట్టినట్టుగా బ్యాక్, మసిల్స్ మాస్తో కనిపిస్తూ తారక్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ లుక్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం కావడంతో మరింత వేగంగా వైరల్గా మారింది.
ఎన్టీఆర్ ‘బీస్ట్ మోడ్’ ట్రాన్స్‌ఫర్మేషన్..
హీరో ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే, తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గత చిత్రాలతో పోలిస్తే మరింత లీన్ అండ్ రగ్గడ్ లుక్‌లో, ఒత్తైన గడ్డం, స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రీసెంట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను షేర్ చేస్తూ..“ఇది తయారు చేయబడింది.. కొనబడలేదు.. (Built. Not bought)” అని క్యాప్షన్ ఇచ్చి మరింత ఆసక్తి రేకేత్తించారు. తన శరీరాకృతి మార్పు కష్టపడి సాధించినదే అని స్పష్టం చేశారు.
అయితే, ఇంతటి మార్పు వెనుక తారక్ పడిన కష్టం అంతా ఇంతా కాదని పర్సనల్ జిమ్ ట్రైనర్ వెల్లడించారు. ఎన్టీఆర్ లక్ష్యం కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆ పాత్ర కోసం సన్నని శరీరాకృతిని సాధించి, అదనపు మజిల్ మాస్ని తగ్గించుకోవడం అని తెలిపారు.
7 వారాల్లో 9.5 కిలోల బరువు తగ్గిన తారక్..
ఎన్టీఆర్ ట్రైనర్ కుమార్ మన్నవా మాట్లాడుతూ..‘‘ఎన్టీఆర్ కేవలం 7 వారాల్లోనే దాదాపు పది కిలోల బరువు తగ్గారు. అయితే ఇది కేవలం బరువు తగ్గడమే కాకుండా, శరీరాన్ని మరింత లీన్‌గా, షార్ప్‌గా మార్చే లక్ష్యంతో జరిగింది. ఇదంతా సాధ్యం కావడానికి, ఎన్టీఆర్ ఫిట్‌నెస్ దినచర్యలో చాలా మార్పులు చేశారు. రోజు తెల్లవారుజామున 45 నుండి 90 నిమిషాల రకు చాలా శ్రద్ధగా వ్యాయామాలు చేసేవాడు. భారీ కండరాల పెంపునకు బదులుగా, బరువు తగ్గించుకోవడానికి ఫంక్షనల్ కదలికలు, కార్డియో ట్రైనింగ్ను చేర్చి, అతని వ్యాయామాలను విభిన్నంగా రూపొందించారు” అని తెలిపారు.
అలాగే, ఎన్టీఆర్ తన కండరాలను తగ్గించి, ఫిట్గా ఉండేందుకు తక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకున్నాడు. క్రమంగా ఇది ఇన్నేళ్లుగా పెంచుకున్న అదనపు కండరాల బరువును తగ్గించుకోవడానికి సహాయపడిందని ట్రైనర్ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ 31 స్టోరీ బ్యాక్ డ్రాప్:
ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ చిత్రం. కోల్ కతా బ్యాక్ డ్రాప్, పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అణగారిన వర్గాల కోసం పోరాడే ఒక నాయకుడి కథతో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే, మరో కథ కూడా వైరల్ అవుతుంది.. 1969 కాలంలో చైనా, భూటాన్, భారతదేశ సరిహద్దుల దగ్గర జరిగే భావోద్వేగాలతో కూడిన యాక్షన్ కథగా రూపొందుతోందని తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ బర్త్ డే సర్‌ప్రైజ్
ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ మైథలాజికల్ మూవీ రాబోతోంది. గాడ్ ఆఫ్ వార్‌గా పురాణాల్లో వర్ణించిన కుమార స్వామి ఇతివృత్తంతో ఇది ఉండనుంది. ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని ఏడాదిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
అదే రోజున టైటిల్‌తో పాటు షూటింగ్ వివరాలను రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కుమార స్వామికి మరో పేరైన ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ పాత్రలోని మల్టిపుల్ షేడ్స్‌ను చూపించబోతున్న త్రివిక్రమ్.. అందుకు తగ్గట్టుగా ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్‌టై బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు.
‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. మరోవైపు వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తీస్తున్నారు త్రివిక్రమ్.
The beast mode is about to ignite again 🔥#NTRNEEL next schedule begins soon.
Man of Masses @tarak9999 #PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm @TSeries pic.twitter.com/8KBZloMI7x
— #NTRNeel (@NTRNeelFilm) November 6, 2025