
అఖండ 2తో నిరాశపరిచిన నందమూరి బాలకృష్ణ స్పీడు పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ ఫ్యాన్స్‌లో జోష్ తీసుకువస్తున్నారు. అంతేకాదు బాలయ్య సెలెక్ట్ చేసుకుంటున్న దర్శకుల పేర్లు కూడా ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి. హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న అఖండ 2 నిరాశపరచటంతో నందమూరి అభిమానులు డీలా పడిపోయారు. అందుకే ఆ లోటు తీర్చేందుకు వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు బాలయ్య. అప్పటికే కమిట్ అయిన గోపిచంద్ మలినేని సినిమాను కూడా ఎర్లీగా పూర్తి చేసేందుకు జానర్ మార్చి గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. గోపిచంద్ మూవీ లైన్‌లో ఉండగానే మరో యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో మూవీకి ఓకే చెప్పారు బాలయ్య. సరిపోదా శనివారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వివేక్, బాలయ్య కోసం డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమాను దసరా సందర్భంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మరో దర్శకుడికి కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ మూవీ చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారన్నది టాలీవుడ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ అప్‌డేట్. ఇలా వరుస సినిమాలతో బాలయ్య జోరు చూపిస్తుండటంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అప్ కమింగ్ కాంబినేషన్స్ మీద భారీ హైప్ ఉండటంతో ఇప్పటి నుంచే సెల్రబేషన్స్‌కు రెడీ అవుతున్నారు. మరి ఈ క్రేజీ కాంబోస్ అభిమానుల అంచనాలను ఎంత వరకు నిజం చేస్తాయో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Liquor: మందుబాబులకు షాక్.. పెరగనున్న మద్యం ధరలు
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
Yasaswi Kondepudi-Jaanu: బ్రేకప్ కాదు.. కొత్తగా ప్యాచప్..! బ్రేకప్ ట్విస్ట్ అదుర్స్