
సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తన రొటీన్ కు భిన్నంగా తెరకెక్కించిన రీమేక్ చిత్రం స్నేహితుడు.బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ త్రీ ఇడియట్స్ కు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు శంకర్. 2012లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఇది శంకర్ రేంజ్ కు తగిన సినిమా కాదన్న నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోని సమస్యలను హైలెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దళపతి హీరోగా నటించాడు. అలాగే ఇలియానా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వీరితో పాటు జీవా, శ్రీకాంత్ (శ్రీరామ్), సత్యరాజ్ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. అయితే ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన రోల్‌లో మిల్లీమీటర్ ఒకటి. ఈ పాత్రలో ఒక కుర్రాడు అద్బుతంగా నటించాడు. అటెండర్‌గా, ఆఫీస్ బాయ్‌గా కనిపించి ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇప్పుడు మిల్లి మీటర్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని కొందరు ప్రయత్నించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మిల్లి మీటర్ కుర్రాడు ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అది కూడా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నాడు.
విజయ్ స్నేహితుడు సినిమాతోనే కెరీర్ ప్రారంభించిన ఈ నటుడి పేరు వికాస్ ముప్పాల. స్నేహితుడు సినిమా తర్వాత 8 తొట్టక్కల్, కళ్లచిరుప్పు, గ్యాంగ్ ఆఫ్ మద్రాస్ తదితర తమిళ సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఇక విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు.ఇందులో విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకడిగా వికాస్ కనిపించాడు.
డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో వికాస్ ముప్పాల..
డియార్ కామ్రేడ్ సినిమా తర్వాత ప్లాట్, పెదకాపు, పంచతంత్ర, గేదెల రాజు తదితర తెలుగు సినిమాల్లోనూ హీరోగా, సహాయక నటుడిగా మెరిశాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ప్రస్తుతం వికాస్ అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ రెండు భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.
వికాస్ మరిన్ని ఫొటోలు, వీడియోలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.