Reading Time: 2 minutes
Bigg Boss Srija: పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ! కాబోయే భర్తను పరిచయం చేసిన దమ్ము శ్రీజ! వీడియో

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో దమ్ము శ్రీజ ఒకరు. మొదట బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సత్తా చాటిన ఆమె కామనర్ కోటాలో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. సుమారు 5 వారాల పాటు ఎంటర్ టైన్ చేసిన ఆమె అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినా మళ్లీ వెంటనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శ్రీజ అడపా దడపా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తోంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో బీబీ జోడి సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన శ్రీజ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది. అలాగే ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలను కూడా పోస్ట్ చేస్తోంది. అలా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను షేర్ చేసింది దమ్ము శ్రీజ. ఇందులో ఆమె ఒక వ్యక్తి ముఖం కనిపించకుండా ‘ మీరు కూడా మీ పార్ట్‌నర్ ను టెంపుల్ డేట్ కు తీసుకెళ్లమని అడగండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

బిగ్ బాస్ దమ్ము శ్రీజ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శ్రీజ త్వరలోనే పెళ్లి చేసుకోనుందేమో! అందుకే ఈ వీడియోతో హింట్ ఇచ్చిందేమో? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరొకరు ‘అతను మీ బావ కదా.. ఫేస్ రివీల్ చేయవచ్చు కదా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే శ్రీజ పెళ్లి చేసుకోబోతోందా? అందుకే ఫేస్ రివీల్ చేయలేదా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే శ్రీజనే స్పందించాల్సి ఉంది.

శ్రీజ షేర్ చేసిన వీడియో..

 

View this post on Instagram

 

A post shared by Srija Dammu (@srija_sweetiee)

కాగా విశాఖపట్నంకి చెందిన శ్రీజ గతంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ లక్షల్లో సంపాదింది. అయితే బిగ్ బాస్ పై ఇష్టంతో అన్నిటినీ వదిలేసి వచ్చింది. ఆ మధ్యన తాను మళ్లీ జాబ్ ఇంటర్వ్యూలకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Srija Dammu (@srija_sweetiee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.