
టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు శివ, రంగీలా, క్షణ క్షణం వంటి దేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన ఆయన విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అదంతా గతంలా మారిపోయింది. ఇప్పుడు ఆయన సినిమాలపై పట్టు కోల్పోయారు. బయోపిక్స్, పోలిటికల్ స్టోరీలంటూ సినిమాలు తీయడం తప్ప విజయాలు అందుకోలేకపోతున్నారు. ఆర్జీవీ కమ్ బ్యాక్ ఇస్తే చూడాలని సందీప్ రెడ్డి వంగా లాంటి ప్రముఖులతో పాటు అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే సినిమాలు చేయకున్నా తరచూ తన కామెంట్స్, సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో ఉంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఇటీవల ధురంధర్ 2 సినిమాపై వరుసగా పోస్టులు పెడుతున్నారాయన. ఆ సినిమాను చూసి దర్శక నిర్మాతలు భయపడుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. వీటిపై చర్చ జరుగుతుండగానే సోషల్ మీడియాలో మరో షాకింగ్ పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ.
భారతీయ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ మంగళవారం (ఏప్రిల్ 7) మరో వసంతంలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీకి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మరో వైపు ఆర్జీవీ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. తనదైన స్టైల్లో’ ఈ రోజు నేను నా చావుకు మరో ఏడాది దగ్గరయ్యానంటూ సెటైరికల్ పోస్ట్ చేశారు. అందువల్ల మీకు సంతోషం కలిగించే మరే ఇతర కారణాల కోసమైతే తప్ప.. ఈ రోజును వేడుకలా జరుపుకోవద్దు! ధన్యవాదాలు.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్జీవీ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆర్జీవీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్..
Today i reached 1 more year closer to my death and so let’s not celebrate unless for whatever reasons that makes you happy ! Thanks
pic.twitter.com/mkKLW9G32t
— Ram Gopal Varma (@RGVzoomin) April 7, 2026
శర్వానంద్ బైకర్ సినిమాను చూడాలనుకుంటున్నా..
Been hearing GREAT things about the film ..Dying to see it ASAP
https://t.co/aGTd9CSURC
— Ram Gopal Varma (@RGVzoomin) April 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


