జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ముఖ్యంగా ఎవరు అయితే వాస్తు నియమాలు పాటిస్తారో, వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఎవరు అయితే వాస్తు నియమాలు ఉల్లంఘిస్తారో, వారు ఆర్థఇక సమస్యలతో సతమతం అవుతుంటారు.
అయితే మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో సంపద పెరగడానికి ఎంతో కష్టపడని పొదుపు చేస్తున్నారా? అయితే ఈ చిన్న చిట్కాల పాలో అయ్యి, మీ ఇంటిని డబ్బుతో నింపేయ్యండి. చిన్న డబ్బాలో డబ్బులు పెట్టి ఈ రెండు దిక్కు్ల్లో పెట్టేయండి. ఇలా చేయడం వలన తప్పకుండా మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
వాస్తు శాస్త్రం ప్రకారం, మనం డబ్బును దాచే దిక్కు కూడా మన ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుందంట. అందువలన తప్పకుండా డబ్బును సరైన దిశలోనే దాచాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బును, డబ్బాలో వేసి, నైరుతి దిశలో పెట్టడం చాలా మంచిదంట. ముఖ్యంగా ఈ దిశలో దాచిన డబ్బు ఇంటి అవసరాలకు ఉపయోగించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.
అలాగే, ఎవరు అయితే ఇంటిలో డబ్బు నిలవక ఇబ్బంది పడుతున్నారో, ఎవరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో, వారు డబ్బును నైరుతి దిశలో, ఉత్తర దిశలతో పాటు వాయువ్య దిశలో కూడ డబ్బును దాచడం చాలా శుభ ప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




