
తాడ్వాయి/ కల్లూరు/ గుండాల, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం పలువురు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ జీపీ తక్కల్లపాడు గుత్తికోయగూడెంలో 15 మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరం నుంచి నార్లపూర్ స్కూల్వచ్చి చదువుతున్నారు. దీంతో ఎంఈవో గడ్డి శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం.కోర్నిబెల్లి నారాయణరావు, కాంప్లెక్స్హెచ్ఎం విద్యాసాగర్కలిసి నెలకు రూ.4 వేలతో విద్యార్థులను చేరవేసేందుకు ఆటోను ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ పాఠశాలకు తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సాదిక్ అలీ 63వ జయంతి సందర్భంగా 15 డ్యూయల్ డెస్క్లను ఆయన సతీమణి ఉషా సాదిక్ అందజేశారు. అంతకుముందు హెచ్ఎం రత్నకుమారి అధ్యక్షతన సాదిక్ అలీ ఫొటోకు నివాళులర్పించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతొగు గ్రామంలో సీఐ తిరుపతి, ఎస్సై శ్రావణ్కుమార్ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు, గొడుగులు అందజేశారు.