
న్యూఢిల్లీ: ప్రజలు తమ ఈ–-మెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవడానికి ఇకపై ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ‘ఆధార్ యాప్’ ద్వారా ఈ–మెయిల్ ఐడీని జోడించడానికి లేదా అప్‌డేట్ చేసుకోవడానికి ఐటీ మంత్రిత్వ శాఖ అనుమతించింది. ఈ ఫ్రీ సర్వీస్ జులై 1, 2026 నుంచి ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
కేవలం ఆధార్ యాప్ ద్వారా మాత్రమే ఈ ఫ్రీ సర్వీస్‌ను పొందొచ్చు. ఇది ప్రారంభమైన కేవలం రెండు రోజుల్లోనే 2.5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఈ–మెయిల్ ఐడీలను యాప్ ద్వారా అప్‌డేట్ చేసుకున్నారు. ఈ కొత్త ఆధార్ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఆధార్‌తో ఈ–మెయిల్ లింక్ చేయడం వల్ల, ఆధార్ అథెంటికేషన్ (ధృవీకరణ) జరిగిన ప్రతిసారీ వినియోగదారులకు రియల్ టైమ్ ఈ–మెయిల్ నోటిఫికేషన్లు అందుతాయి. దీంతో భద్రత పెరుగుతుంది.
ఇతర సేవలు
ఈ యాప్ ద్వారా ఈ–మెయిల్‌తో పాటు మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ (చిరునామా) మార్పు వంటి పలు సేవలను స్మార్ట్‌ఫోన్ నుంచే పొందొచ్చు. ఇప్పటివరకు 4 కోట్లకు పైగా (40 మిలియన్లు) ప్రజలు ఈ యాప్ ద్వారా తమ మొబైల్ నంబర్లను అప్‌డేట్ చేసుకోగా, దాదాపు 10 లక్షల (1 మిలియన్) మంది తమ చిరునామా వివరాలను మార్చుకున్నారు