Reading Time: < 1 minute
Ap Cabinet Approves Png As Alternative To Lpg For Consumers

AP Cabinet Approves PNG: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని LPG వినియోగదారులకు PNG (ప్రాక్సిమిటీ నేచురల్ గ్యాస్) వినియోగం ద్వారా ప్రత్యామ్నాయ సౌకర్యాన్ని అందించే దిశగా నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అనుమతితో అమలు చేయబడుతోంది. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్‌.. అపార్ట్‌మెంట్స్‌.. ఇండస్ట్రీ యూనిట్లు PNG స్కీమ్‌ను ఉపయోగించవచ్చు. అలాగే, ఆలయాలు.. తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం వంటి ప్రాంతాల్లో PNGను LPGకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సౌకర్యం కల్పించబడుతుంది అన్నారు.. అన్న క్యాంటీన్లలో కూడా PNG వినియోగానికి ఏర్పాట్లు చేయబడతాయని వెల్లడించారు..

Read Also: Pat Cummins-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు శుభవార్త.. పాట్‌ కమిన్స్‌ రాకకు టైమ్ ఫిక్స్!

అదనంగా, దీపం పథకం కింద ఉన్న LPG వినియోగదారులు PNGకు మారినపుడు ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలిపారు మంత్రి మనోహర్‌.. ఈ విషయంపై అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల PNG కనెక్షన్ల ఏర్పాటు చేయడానికి అంతర్గత కమిటీ పనిచేస్తోంది. ముఖ్య నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడలో PNG కనెక్షన్ల వినియోగాన్ని పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వెల్లడించారు.. మొత్తంగా ఏపీ కేబినెట్‌ ఈ నిర్ణయం ద్వారా LPG వినియోగదారులు PNG వైపు మారి, సౌకర్యవంతమైన, సురక్షితమైన ఇంధన వనరులను ఉపయోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది..