యూపీలో గుడ్లపై ఎక్స్ పైరీ డేట్.. సీఎం యోగి సర్కార్ నిర్ణయం

ఉత్తరప్రదేశ్‌లో ఆహార భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం..ఇప్పుడు కోడిగుడ్ల సరఫరాలో కొత్త నిబంధనలు అమలు చేయబోతోంది. గుడ్లపై ఎక్స్ పైరీ డేట్ వేయాలని నిర్ణయించింది. పాడైపోయిన గుడ్ల సరఫరాను అరికట్టేందుకు, కస్టమర్లకు తాజా గుడ్లు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా ప్రకటించింది యూపీప్రభుత్వం.
నిబంధనలుపాటించని షాపులపై కఠిన చర్యలు తప్పవన్న సీఎం యోగి హెచ్చరించారు. ఏప్రిల్ 1నుంచి నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గుడ్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, రిటైల్ షాపులు ఈ రూల్స్‌ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ఇటీవల కుళ్లిపోయిన గుడ్ల సప్లయ్ పెరుగుతుండటం, ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు పెరగడంతో కస్టమర్లనుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్ వచ్చాయి. దీంతో సీఎం యోగి ఈనిర్ణయం తీసుకున్నారు.
►ALSO READ | పాటలతో సెన్సేషన్..రూ.947 కోట్ల ఆదాయం.. మ్యూజిక్ షోలతో కోట్ల వర్షం కురిపించిన దిల్జిత్
ఎక్స్‌పైరీ డేట్ లేకుండా గుడ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఎం యోగి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులపై జరిమానాలు, లైసెన్స్ రద్దు వరకు చర్యలు ఉండనున్నట్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.