July 12, 2026

Lenin Movie: అఖిల్ ‘లెనిన్’ సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ మాములుగా లేదుగా

Lenin Movie: అఖిల్ ‘లెనిన్’ సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ మాములుగా లేదుగా
Reading Time: 2 minutes
Lenin Movie: అఖిల్ ‘లెనిన్’ సినిమాలో అదరగొట్టిన ఈ నటుడు ఎవరో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ మాములుగా లేదుగా

హీరో అఖిల్ అక్కినేని ఎట్టకేలకు ఓ సాలిడ్ హిట్ అందుకున్నాడు. అతను నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్ శుక్రవారం (జులై 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ. 16 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి కూడా లెనిన్ సినిమానే మొదటి హిట్ అనుకోవచ్చు. ఈ సినిమాలో భాగ్యశ్రీ పోషించిన భారతి పాత్రకు కూడా మంచి పేరొస్తోంది. వీరితో పాటు ఈ సూపర్ హిట్ సినిమాలో
సీనియర్ నటులు శివాజీ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ఇదే సినిమాలో ఇంకో పాత్ర బాగా హైలెట్ అవుతోంది. అదే లెనిన్ ఫ్రెండ్ గా నటించిన వసంత్. కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రమోద్ పంజు ఈ మూవీలో అఖిల్ కు ప్రాణ స్నేహితుడిగా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఈ పాత్రతో వచ్చే ట్విస్ట్ లు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ జాతర సీన్ లోనూ తన నటనతో అదరగొట్టేసాడు ప్రమోద్ పంజు. నిజం చెప్పాలంటే జాతర సీక్వెన్స్ లో ప్రమోద్ తన నటనతో అఖిల్ ని డామినేట్ చేసాడని చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే లెనిన్ సక్సెస్ మీట్ లో కూడా నాగార్జున ప్రమోద్ పంజుపై ప్రశంసలు కురిపించారు. అలాంటి నాగార్జుననే తన యాక్టింగ్ తో మెప్పించిన ఈ ప్రమోద్ పంజు ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రమోద్ పంజు ఒక కన్నడ నటుడు. సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆతర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కన్నడ సినిమాల్లో హీరోగానూ చేస్తున్నాడు. అలాగే విలన్ గానూ ఆకట్టుకుంటున్నాడు. గతంలో ప్రభాస్ నటించిన సలార్ లోనూ ప్రమోద్ ఒక కీలక పాత్ర పోషించాడు. వరదరాజ మన్నార్(పృథ్వీరాజ్ సుకుమారన్) సోదరుడు బాచి రాజమన్నార్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు లెనిన్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా తర్వాత ప్రమోద్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

హీరో అఖిల్ అక్కినేనితో ప్రమోద్ పంజు..

 

View this post on Instagram

 

A post shared by Pramod k (@pramodactor1)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి