July 12, 2026

ఇంగ్లండ్ తో టెస్ట్ లో క్రాంతి 5 వికెట్లు…

ఇంగ్లండ్ తో టెస్ట్ లో క్రాంతి 5 వికెట్లు...
Reading Time: < 1 minute

ఇంగ్లండ్ తో టెస్ట్ లో క్రాంతి 5 వికెట్లు…

Caption of Image.

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ విమెన్స్‌‌‌‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌‌‌‌లో ఇండియా పట్టు బిగించింది. క్రాంతి గౌడ్‌‌‌‌ (5/37) బౌలింగ్‌‌‌‌లో చెలరేగడంతో.. 27/1 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో శనివారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 59.1 ఓవర్లలో 170 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. అమీ జోన్స్‌‌‌‌ (52), నాట్ సివర్‌‌‌‌ బ్రంట్‌‌‌‌ (44) మినహా మిగతావారు నిరాశపర్చారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌‌‌‌కు 84 రన్స్‌‌‌‌ జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. తొలి సెషన్‌‌‌‌ నుంచే క్రాంతి అద్భుతమైన బౌలింగ్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌ బ్యాటర్ల పని పట్టింది. 

మియా బౌచర్‌‌‌‌ (23), మ్యాడీ విలియర్స్‌‌‌‌ (10), ఎకిల్‌‌‌‌స్టోన్‌‌‌‌ (11) ఓ మాదిరిగా ఆడారు. ట్యామీ బ్యూమెంట్‌‌‌‌ (2), హీథర్‌‌‌‌ నైట్ (6), అలైస్‌‌‌‌ క్యాప్సీ (9), ఇసీ వాంగ్‌‌‌‌ (7 నాటౌట్‌‌‌‌), లారెన్‌‌‌‌ బెల్‌‌‌‌ (3), లారెన్‌‌‌‌ ఫిలర్‌‌‌‌ (0) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. సయాలీ, స్నేహ్‌‌‌‌ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఇండియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 42 ఓవర్లలో 154/1 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (33) ఔటైనా.. స్మృతి (69 బ్యాటింగ్‌‌‌‌), యాస్తిక భాటియా (39 బ్యాటింగ్‌‌‌‌) మెరుగ్గా ఆడారు. ప్రస్తుతం ఇండియా 269 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతోంది.
 

©️ VIL Media Pvt Ltd.