Reading Time: 2 minutes
Chilakalaguda Girl Death Harassment Case

ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు.. వినకపోవడంతో కుటుంబసభ్యులను బెదిరించాడు. ఐనా యువతి దారిలోకి రాకపోవడంతో, చివరకు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడో ప్రేమోన్మాది. కొద్ది సేపటికే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తన కూతురును ప్రేమించమంటూ వెంటపడ్డ యువకుడే హత్య చేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన కలకలం సృష్టించింది. చిలకలగూడలోని శ్రీనివాస్‌నగర్‌లో కోటేశ్వర్‌రావు, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కూతురు జెనీమా ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. ఐదు నెలల క్రితం నాగర్‌ కర్నూలుకు చెందిన జగదీశ్‌, జెనీమాకు పరిచయమయ్యాడు. జగదీశ్‌ను ఫ్రెండ్‌గా భావించిన జెనీమా వెంట గత కొద్ది రోజులుగా ప్రేమించమంటూ వెంటపడుతూ వచ్చాడు. జెనీమా మాత్రం జగదీశ్‌ ప్రేమ ప్రపోజల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది రోజుల నుంచి జగదీశ్‌, జెనీమాను వేధిస్తున్నాడు. చివరకు జెనీమా ఇంట్లో ఎవరూ లేరని.. ఇంట్లో ఒక్కతే ఉందన్న విషయం పసిగట్టిన జగదీశ్‌.. ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ బెదిరింపులకు దిగాడు. ఎంతకీ జెనీమా ఒప్పుకోకపోవడంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. జెనీమా కాలి వేళ్లను తొక్కుతూ బెదిరింపుకు పాల్పడ్డాడు. ఐనా. జెనీమా మాత్రం ఒప్పుకోలేదు. దీంతో అంతు చూస్తానని బెదిరించాడు జగదీశ్‌..

US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు

జెనీమా, తల్లిదండ్రులు… కూరగాయల వ్యాపారం చేసేవారు.. రోజూ మాదిరిగానే ఉదయమే ఇంట్లోంచి ఇద్దరు బయటికి వెళ్లారు. కొద్ది సేపటికే జెనీమా, తల్లికి ఫోన్‌ చేసి జగదీశ్‌ వచ్చి తనను కొట్టాడని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన జెనీమా తల్లి రమాదేవికి.. కూతురు ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే తల్లి కేకలు విన్న స్థానికులు హుటాహుటిన ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. ఫ్యాన్‌కు వెలాడుతున్న జెనీమాను కిందకి దింపి చూడగా.. కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అప్పటికే జెనీమా చనిపోయిందని ధృవీకరించారు..

తాను ఇంటి నుంచి బయల్దేరినప్పుడు తన కూతురు రోజు మాదిరిగానే ఇంట్లో పని చేసుకుంటుందని ఆమె తండ్రి కోటేశ్వర్‌రావు అంటున్నాడు. తన కూతురును జగదీశ్‌ అనే వాడు వేధిస్తున్నాడన్న విషయం తనకు తెలియదని.. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే మాట్లాడి పరిష్కరించుకునే వాళ్లమని, తన కూతురు తనకు దక్కేదని జెనీమా తండ్రి కన్నీటి పర్యాంతమవుతున్నాడు.. జెనీమాను జగదీశే చంపాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ జగదీశ్‌ చంపాడంటూ పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జగదీశ్‌ కోసం గాలిస్తుండగా.. పోస్టుమార్టం పూర్తయిన తరువాత జెనీమా డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు…

Poco X8 Pro: పోకో X8 Pro సిరీస్ వచ్చేసింది.. 9000mAh బ్యాటరీ + 100W ఛార్జింగ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే