July 11, 2026

Uncapped Players In IPL: అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం.. యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఫోకస్

Uncapped Players In IPL: అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం.. యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఫోకస్
Reading Time: 2 minutes

Uncapped Players In IPL: అన్‌క్యాప్డ్ ప్లేయర్లపై కోట్ల వర్షం.. యువ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల ఫోకస్

Caption of Image.

Uncapped Players In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 వేలం ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. అనుభవం లేకపోయినా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. భవిష్యత్ స్టార్‌లను గుర్తించేందుకు అన్ని జట్లు పోటాపోటీగా బిడ్డింగ్ చేయడంతో వేలం చాలా ఉత్కంఠభరితంగా కొనసాగింది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ప్రతిభను తమ టీమ్ లోకి తీసుకోవడంలో ముందు వరుసలో నిలిచాయి.

ఈ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు ప్రశాంత్ వీర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 20 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14.20 కోట్లు వెచ్చించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ప్రశాంత్ నిలిచాడు. అలాగే రాజస్థాన్‌కు చెందిన వికెట్‌కీపర్ కార్తీక్ శర్మ కూడా రూ.14.20 కోట్లకి అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఇద్దరూ యంగ్ ప్లేయర్స్ చెన్నై జట్టుకు కీలకంగా మారనున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్యప్రదేశ్ యువ ఆల్‌రౌండర్ మంగేష్ యాదవ్‌ను రూ.5.20 కోట్లకు సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్న అతను ఆర్సీబీ మిడిల్ ఆర్డర్‌లో కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంటుంది. బౌలింగ్ లో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ కూడా ఈసారి వేలంలో హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. రంజీ ట్రోఫీలో 60 వికెట్లతో చరిత్ర సృష్టించిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో ఆకిబ్ నబీ నైపుణ్యం జట్టుకు బిగ్ ప్లస్‌గా మారనుంది.

►ALSO READ | Indian Team: పెరుగుతున్న ఫ్యాన్ ఆర్మీ సంస్కృతి.. భారత క్రికెట్ని నాశనం చేస్తోంది.. 

రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్న అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్న తేజస్వి సేయింగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన సలీల్ అరోరా లాంటి యంగ్ స్టార్స్ కూడా ఈ సీజన్‌లో మ్యాచ్ విన్నర్లుగా నిలిచే ఛాన్స్ ఉంది. ఈసారి ఐపీఎల్ 2026 సీజన్ యువ ఆటగాళ్లతో మరింత రసవత్తరంగా మారనుంది. భవిష్యత్ స్టార్‌లు ఈ వేదికపై ఎలా మెరుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

©️ VIL Media Pvt Ltd.