July 12, 2026

Pawan Kalyan: ఓవర్సీస్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డుల వేట.. 2 లక్షల డాలర్లు దాటిన సేల్స్!

Pawan Kalyan: ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' రికార్డుల వేట.. 2 లక్షల డాలర్లు దాటిన సేల్స్!
Reading Time: 2 minutes

Pawan Kalyan: ఓవర్సీస్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డుల వేట.. 2 లక్షల డాలర్లు దాటిన సేల్స్!

Caption of Image.

వెండితెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పునకాలే.  ఉగాది కానుకగా మార్చి 19, 2026న ‘ఉస్తాద్ భగత్ సింగ్’  ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. మాస్ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కాంబోలో  గతంలో వచ్చిన  ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్ కు ముందే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టింది. 

బుకింగ్స్‌లో టాప్ గేర్!

ఈ చిత్రం కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 18న జరగనున్న నార్త్ అమెరికా ప్రీమియర్ల కోసం ఇప్పటికే 10,000 పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కేవలం అమెరికాలోనే 406 లోకేషన్లలో 210,024 డాలర్లు (సుమారు రూ.1.75 కోట్లు) అడ్వాన్స్ సేల్స్ సాధించి పవన్ కళ్యాణ్ స్టామినాను నిరూపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరిమితంగా ప్రారంభమైనప్పటికీ, గత 24 గంటల్లోనే బుక్ మై షోలో 14.69 వేల టిక్కెట్లు అమ్ముడవ్వడం విశేషం. సినిమా రిలీజ్ దగ్గరపడే కొద్ది సెల్ ఇంకా పెరగనుంది.

ఫ్యాన్స్ వార్స్ పక్కన పెట్టి..

మార్చి 15న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేకలతో దద్దరిల్లిపోయింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇతర హీరోల అభిమానులను గౌరవించాలని చెబుతూ, ఆయన జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం అందరినీ ఆకట్టుకుంది. ఫ్యాన్ వార్స్ పక్కన పెట్టి తెలుగు సినిమాను గౌరవించుకోవాలనే ఆయన పిలుపు నిచ్చారు. ఇదే వేడుకలో తన ఫోన్ రింగ్‌టోన్ వస్తున్న ఓ అభిమానిని శ్రీలీల ఎంతో ముద్దుగా మ్యూట్ చేయమని కోరడం అక్కడ నవ్వులు పూయించింది.

►ALSO READ | Oscar Awards: 98వ ఆస్కార్ అవార్డులు: సత్తా చాటిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్.. ఫుల్ లిస్ట్ ఇదే !

తారాగణం

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. పార్తిబన్, కేఎస్ రవికుమార్, గౌతమి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు.. పర్ఫార్మెన్స్ కూడా బద్దలైపోతుంది అని హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మార్చి 19న ఉగాది పచ్చడితో పాటు ‘ఉస్తాద్’ ఇచ్చే మాస్ ట్రీట్ ఎలా ఉండబోతుందో చూడాలి!

 

©️ VIL Media Pvt Ltd.