Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచప్‌ తుది దశకు చేరుకుంది. సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేసిన న్యూజిలాండ్, భారత్‌లు ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసిసి కీలక ప్రకటన చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్‌కి అంపైర్ల వ్యవహరించే వాళ్ల వివరాలను వెల్లడించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లు వ్యవహరిస్తారని పేర్కొంది.

అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, 2024 టి-20 ప్రపంచకప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లకు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ యే అంపైర్ వ్యవహరించారు. 2024, 2025లో ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన భారత్, 2023లో మాత్రం ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఓటమి ఎగరకుండా ఫైనల్‌కు చేరిన భారత్.. ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదురుకొవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ కూడా ఈసారి టి-20 ప్రపంచకప్ ఫైనల్ జరుగుతున్న నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగింది. దీంతో ఫ్యాన్స్ దీన్ని భారత్‌కు దురదృష్టంగా భావిస్తున్నారు. భారత్‌కు ఎలాంటి ఎదురు దెబ్బ తగలకూడదని ప్రార్థిస్తున్నారు.