
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి టిపిసిసి ఎలక్షన్ కమిషన్ కో -ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. నితీష్‌కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబిన్ గురువారం రాజ్యసభకు నామినేషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో నలుగురు కన్నా ఎక్కువమందిని తమ నామినేషన్ పత్రాలు సమర్పించడానికి రిటర్నింగ్ ఆఫీస్‌కు వెళ్లారు. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. తక్షణమే దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి పులిపాటి రాజేష్ కుమార్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.