Reading Time: < 1 minute

వరుణ్ తేజ్ KoreanKanakaraju ట్రైలర్ రివ్యూ.. ఇదేదో వర్కౌట్ అయ్యే లానే ఉందిగా !

Caption of Image.

ఈ ఆగస్ట్ మొదటి వారంలో థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమా ‘కొరియన్ కనకరాజు’ ట్రైలర్ను శనివారం విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఫన్, హారర్ కలగలిపి కొరియా దెయ్యంతో దర్శకుడు మేర్లపాక గాంధీ ఆసక్తికర ప్రయోగం చేసినట్లుగానే అనిపించింది. సత్య, వరుణ్ తేజ్ మధ్య కామెడీ ట్రాక్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలిగితే పాజిటివ్ టాక్ ఖాయంగా కనిపిస్తుంది. 2 నిమిషాల 54 సెకన్ల KoreanKanakaraju ట్రైలర్ ఈ సినిమా వినోదమే ప్రధానంగా సాగుతుందని స్పష్టం చేసింది.

హారర్ టచ్ ఉన్నా కామెడీకే ఎక్కువగా దర్శకుడు.. ప్రేక్షకులను కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడని క్లారిటీ వచ్చేసింది. కామెడీ, హారర్ కథలు టాలీవుడ్ కు కొత్తేం కాదు. జగన్మోహిని సినిమా అప్పటి నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. తెలుగులో డబ్ అయిన ‘చంద్రముఖి’, ‘కాంచన’ సినిమాలతో పాటు ఓంకార్ ‘రాజు గారి గది’ లాంటి కొన్ని సినిమాలు సూపర్ హిట్స్ కాగా.. వాటికి సీక్వెల్స్గా వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సందర్భాలూ ఉన్నాయి.

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. ఈ జానర్ సినిమాలకు ప్రేక్షకులు వినోదం ఆశించి వస్తారు. కొంచెం భయపడటానికి కూడా. ఈ రెండు అంశాలను ప్రాపర్గా డీల్ చేయగలిగితే ‘కొరియన్ కనకరాజు’ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ట్రైలర్ అయితే వినోదాత్మకంగానే అనిపించింది. ‘మత్తు వదలరా’ సినిమాలో సత్య కామెడీ హైలైట్ అయినట్టుగా ఈ సినిమాలో కూడా సత్య చేసే ఫన్ నవ్వులు పూయిస్తే ప్రేక్షకుల పొట్ట చెక్కలవడం ఖాయం. దర్శకుడు మేర్లపాక గాంధీకి ఈ ఫన్ ఫిల్డ్ జానర్ డీల్ చేయడంలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘ఏక్ మినీ కథ’ సినిమాలే ఇందుకు ఉదాహరణ.

©️ VIL Media Pvt Ltd.