Reading Time: < 1 minute

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..రెండు రోజులు  వైన్స్, బార్లు, రెస్టారెంట్లు బంద్

Caption of Image.

ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను పురస్కరించుకుని నగరంలో కీలక ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు వైన్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

మార్కెట్ , గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు పూర్తిగా బంద్ ఉండనున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలోనూ ఈ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

బోనాల వేడుకలు అత్యంత ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు ప్రజలు , వ్యాపారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

©️ VIL Media Pvt Ltd.