
టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. మలేసియాకు చెందిన మహావిష్ణు అనే ఆధ్యాత్మిక గురువుతో ఆమె కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అతడితో రహాస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకున్నారు. దీంతో వీరిద్దరికి అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గత ఏడేళ్లుగా వీరిద్దరు మంచి స్నేహితులు. మృణాళిని రవి.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించి, త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన 2019 చిత్రం ‘సూపర్ డీలక్స్’తో తమిళ చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఆమె సుశీంద్రన్ దర్శకత్వం వహించిన ‘ఛాంపియన్’ చిత్రంలో నటించింది. ఆర్య, విశాల్ నటించిన ‘ఎనిమీ’ చిత్రంలో నటించారు. ఆమె ‘ఎంజీఆర్ మగన్’, ‘జాంగో’ చిత్రాలలో నటించి, విక్రమ్ నటించిన ‘కోబ్రా’ చిత్రంలోని తన పాత్రతో గుర్తింపు పొందారు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
తెలుగులో మాయ మశ్చింద్రా చిత్రంలో కనిపించారు. ఆమె చివరగా రోమియో చిత్రంలో నటించారు. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం 2024లో విడుదలైంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు… ఇప్పుడు ఆకస్మాత్తుగా నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది. త్వరలోనే ఈ అమ్మడు నటనకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఈ ముద్దుగుమ్మ నటనలోకి రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఆ గుర్తింపుతోనే ఆమెకు సినిమాల్లో అవకాశాలు లభించాయి. 2019లోనే వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ‘బుజ్జమ్మ’ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
మృణాళిని రవి పోస్ట్..
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..