Reading Time: < 1 minute

హైదరాబాద్ -ముంబై హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్: కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు

Caption of Image.

హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే ఎన్‌హెచ్ 65 (NH 65) రహదారిపై వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి.

ముఖ్యంగా రుద్రారం గ్రామం వద్ద రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  గంట నుంచి వాహనాలు కదలకుండా ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఈ భారీ ట్రాఫిక్ జామ్‌లో అత్యవసరంగా వెళ్లాల్సిన అంబులెన్సులు సైతం చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో మగ్గిపోతుండటంతో ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

©️ VIL Media Pvt Ltd.