Reading Time: < 1 minute

Toxic Trailer: యష్ ఫ్యాన్స్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. ‘టాక్సిక్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Caption of Image.

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గోన్ అప్స్’ ( Toxic ) నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ షేర్ చేశారు.

హీరో యష్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ, ఆగస్టు 8న ‘టాక్సిక్’ ట్రైలర్ విడుదల కానుందని, సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మోనోక్రోమ్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వర్షంలో ఆయుధంతో కనిపిస్తున్న ఓ మిస్టీరియస్ సిల్హౌట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ‘టాక్సిక్’

గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ‘తబాహీ’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక రెండో సాంగ్ ‘మధోష్’ కూడా మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. టీజర్ & రాయా గ్లింప్స్ ఆడియన్స్ లో మరింత హీట్ని పెంచేశాయి. ఇక ఆగస్టు 8న రానున్న ట్రైలర్ ఇంకెలా ఉంటుందో చూడాలి. 

ఇకపోతే, టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఓణం, ఈద్-ఎ-మిలాద్ వంటి పండుగలు ఉండటంతో పాటు రక్షాబంధన్ వీకెండ్ కూడా కలిసి రావడం ‘టాక్సిక్’ బాక్సాఫీస్ రేంజ్‌ను మరింత పెంచుతుందని సినీ ట్రేడర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించగా.. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో డబ్ వెర్షన్లు కూడా విడుదల కానున్నాయి. ఇందులో యశ్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.