
సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా తనదైన ముద్రవేశారు ప్రభుదేవ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించారు. అలాగే అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు. అంతేకాకుండా సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగానూ సక్సెస్ అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనకు తెలుగులో ఇష్టమైన హీరో గురించి.. అలాగే ఆయన యాక్టింగ్, హార్డ్ వర్కింగ్, కామెడీ టైమింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని.. ఆయన కింగ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ అని అన్నారు. ఆ రోజుల్లో చిరంజీవి డ్యాన్సర్లలో అగ్రస్థానంలో ఉన్నారని.. ఆయన అలుపెరుగని కృష్టిని మరోసారి గుర్తు చేసుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
ప్రభుదేవా మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నిజంగానే కింగ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్. ఆయనకు అలుపే లేదు,” అని ప్రభుదేవా అన్నారు. తనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటూ, “సాయంత్రం రిహార్సల్స్‌కి పిలిచి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉండేవారు. నేను అలా కూర్చుని చూసేవాడిని. ఆయన ఇంట్లో దోశలు భయంకర ఫేమస్. ఆ దోశలు నన్ను తినపెట్టి, ఆయన మళ్ళీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. చిరంజీవి సార్ అంతటి అంకితభావంతో పనిచేసేవారు” అని వివరించారు. చిరంజీవికి స్టార్‌డమ్ రావడానికి, ప్రజల్లో విశేష ఆదరణ పొందడానికి ఆయన పాటలు, ముఖ్యంగా వినూత్నమైన డ్యాన్స్ స్టెప్పులు ప్రధాన కారణం” అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
చిరంజీవి డ్యాన్స్‌లోనే కాకుండా, నటనలోనూ తనదైన ముద్ర వేశారని ప్రభుదేవా స్పష్టం చేశారు. “చిరంజీవి సార్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక కంప్లీట్ ప్యాకేజ్ సార్. ఆయన నటన అద్భుతం. భావోద్వేగాలను పండించడంలో ఆయనకు సాటి లేరు. స్టైల్, డ్యాన్స్ – ఇలా అన్ని విభాగాల్లోనూ చిరంజీవి సంపూర్ణ కళాకారుడు” అని ప్రభుదేవా చెప్పుకొచ్చారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
ప్రభుదేవా, చిరంజీవి ఫోటో..
Prabhudeva, Chiranjeevi
ఎక్కువమంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..