మారిన మన జీవనశైలిలో సంప్రదాయ ఆహారపు అలవాట్లను మర్చిపోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి మనకు ఇచ్చే అద్భుతమైన ఔషధాలలో తాటి ‘తేగలు’ ఒకటి. సీజనల్ ఫుడ్‌గా లభించే ఈ తేగలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతో శరీరానికి కావలసిన పిండి పదార్థాలు, పీచు పదార్థాలను అందించే ఈ సంప్రదాయ ఆహారం ఎలా తయారవుతుంది? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తేగలు ఎలా తయారవుతాయి?: తాటి చెట్ల నుంచి జూన్, జూలై మాసాల్లో రాలిన పండ్ల నుంచి గింజలను సేకరిస్తారు. వాటిని నేలలో గొయ్యి తీసి పూడ్చిపెడతారు. ఇక దాదాపు మూడు నెలల సమయం తర్వాత గింజల నుంచి మొలకలు వచ్చి తేగలుగా మారతాయి. ఆ తర్వాత వాటిని నేల నుంచి తీసి, కుండలలో పేర్చి బట్టీలా కాల్చుతారు. కాలిన తేగలను వేరుచేసి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు.

ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో: తేగలలో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మటుమాయమవుతాయి. చిఇక న్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా వీటిని ధైర్యంగా తినవచ్చు. ఇక దీనికి ఎలాంటి వైద్యపరమైన ఆంక్షలు లేవు. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఈ సంప్రదాయ ఆహారం ఆరోగ్యానికి ఎంతో రక్షణనిస్తుంది.
ఇక తక్కువ ఖర్చుతో అత్యధిక పోషకాలను అందించే తేగలను ఎక్కడ చూసినా వదలకుండా కొనుగోలు చేయండి. నేటి ఆధునిక జనరేషన్‌కు కూడా మన సంప్రదాయ ఆహారాల గొప్పదనాన్ని, వాటి రుచిని పరిచయం చేయడం ఎంతైనా అవసరం.
గమనిక: ఈ సమాచారం సాంప్రదాయ ఆహార అలవాట్లు మరియు మీడియా నివేదికల ఆధారంగా అందించబడింది. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు లేదా వైద్య సలహాలు పాటిస్తున్నవారు తమ డైట్‌ను బట్టి తగిన మోతాదులో తీసుకోవడం శ్రేయస్కరం.
The post తక్కువ ఖర్చు.. ఎక్కువ పోషకాలు! సంప్రదాయ ఆహారాల విలువ తెలుసా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.