Reading Time: < 1 minute

Varun Tej : స్టిక్‌తోనే ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్.. ఆరోగ్యంపై షాకింగ్ అప్‌డేట్.!

Caption of Image.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్‌ కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో  ప్రమోషన్స్‌ స్పీడప్ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి కార్యక్రమంలో వరుణ్ తేజ్ స్టిక్ సాయంతోనే వేదికపైకి రావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇటీవల కాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయినప్పటికీ సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలనే బాధ్యతతో వరుస ఈవెంట్లలో పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.  ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వరుణ్ తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పూర్తిగా ఫిట్ కావాలంటే ఇంకా రెండు నుంచి మూడు నెలలు పడుతుంది. డాక్టర్లు అనుమతించిన తర్వాతే ‘బరి’షూటింగ్ మొదలుపెడతాను అని వెల్లడించారు.

వరుణ్ తేజ్ తన తదుపరి స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ కోసం ప్రత్యేకంగా ఫుట్‌బాల్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించగా, గత మూడు నెలలుగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ కొనసాగుతుండగా, నడిచేందుకు ఇంకా ఊతకర్ర సాయమే అవసరమవుతోంది.   ‘కొరియన్ కనకరాజు’ మూవీని రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సత్య కీలక పాత్ర పోషిస్తున్న ఈమూవీకి తమన్‌ మ్యూజిక్‌ అందించారు.

దీంతో ‘బరి’ షూటింగ్ మరికొంత ఆలస్యం కానుందని స్పష్టమైంది. అయితే గాయం ఉన్నప్పటికీ అభిమానులను నిరాశపరచకుండా ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరవుతున్న వరుణ్ తేజ్‌పై మెగా ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో త్వరగా కోలుకుని మళ్లీ అదే ఎనర్జీతో సెట్స్‌లోకి రావాలిఅంటూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘కొరియన్ కనకరాజు’పై రోజురోజుకూ పెరుగుతున్న అంచనాలకు వరుణ్ తేజ్ అంకితభావమే అదనపు బలం అవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

 

©️ VIL Media Pvt Ltd.