
India Medal Table: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో 10వ రోజు భారత్ కళ్లు చెదిరే ప్రదర్శనతో విరుచుకుపడుతుంది. బాక్సింగ్, పారా అథ్లెటిక్స్, ట్రిపుల్ జంప్‌లలో మన అథ్లెట్లు వరుస పతకాలు కొల్లగొడుతూ మెడల్స్ టేబుల్‌లో ఇండియాను మరింత పైస్థానానికి దూసుకెళ్లింది.
బంగారు పతకాలు కొట్టిన భారత్:
10వ రోజు ప్రారంభంలోనే బాక్సింగ్ రింగ్‌లో భారత మహిళా బాక్సర్లు విశ్వరూపం చూపించారు. ఈ విజయాలతో భారత్ సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య 9కి చేరింది.
* ప్రీతి పవార్: మహిళల 54 కేజీల ఫైనల్లో కెనడా బాక్సర్‌ను చిత్తు చేసి స్వర్ణ పతకం సాధించింది.
* జాస్మిన్ లాంబోరియా: 57 కేజీల ఫైనల్లో మైఖేలా వాల్ష్‌పై గెలిచి భారత్‌కు మరో గోల్డ్ అందించింది.
* సోమన్ రానా: పారా అథ్లెటిక్స్ పురుషుల F57 షాట్‌పుట్ ఈవెంట్‌లో సీజన్ బెస్ట్ త్రోతో పసిడి పతకాన్ని ముద్దాడాడు.
పోడియంను స్వీప్ చేసిన ఇతర ఆటగాళ్లు:
గోల్డ్ మెడల్స్‌తో పాటు మిగిలిన క్రీడల్లోనూ భారత్ పతకాలతో అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్ ముగింపు దశకు చేరిన వేళ, మిగిలిన ఈవెంట్లలోనూ మరిన్ని రజతాలను స్వర్ణాలుగా మారుస్తూ మెడల్స్ టాలీలో మరింత పైకి చేరాలని భారత బృందం పట్టుదలతో ఉంది. అభిమానులు కూడా ఇండియన్ అథ్లెట్ల నుంచి మరిన్ని గోల్డెన్ పంచ్‌లను ఆశిస్తున్నారు.
* షాట్‌పుట్ (F57): శుభమ్ జుయల్ రజత పతకం (Silver) సాధించి భారత్‌కు వన్-టూ పోడియం ఫినిష్ ఇచ్చాడు.
* ట్రిపుల్ జంప్: ప్రవీణ్ చిత్రావెల్ రజతం (Silver), సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్యం (Bronze) గెలుపొంది సరికొత్త చరిత్ర సృష్టించారు.
* బాక్సింగ్: బాక్సర్ జాదుమణి సింగ్ కూడా తన విభాగంలో మెడల్‌ను ఖరారు చేసుకుని పోడియంపై నిలిచాడు.
* భారత్ ఖాతాలో ఏకంగా 15 రజత పతకాలు (Silver Medals) చేరడంతో మన అథ్లెట్ల ప్రతిభకు, స్థిరమైన ప్రదర్శనకు నిదర్శనం.
కామన్వెల్త్ గేమ్స్ లో టాప్–6 దేశాలు:
ర్యాంక్ దేశం గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మొత్తంపతకాలు
1 ఆస్ట్రేలియా 59 32 46 137
2 ఇంగ్లాండ్ 21 36 30 87
3 కెనడా 17 16 21 54
4 స్కాట్లాండ్ 10 8 16 34
5 నైజీరియా 10 6 4 20
6. భారత్ 8 15 7 30
Double delight in the Men’s Triple Jump event as we win both the Silver and Bronze Medals.
Congratulations to Praveen Chithravel and Selva Prabhu on winning the Silver and Bronze respectively 🙌🏽💙
Let’s #Cheer4Bharat #WeAreTeamIndia | #TogetherWeDream pic.twitter.com/AZIBYrA8ce
— Team India (@WeAreTeamIndia) August 1, 2026